కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఆసరా భద్రతా పించన్ల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత (Congress–BRS Workers Clash) చోటు చేసుకుంది. మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరయ్యారు. పింఛన్లు పంపిణీ చేస్తుండగా సబితా ఇంద్రారెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది. ఆమెను ఉద్దేశించి వాళ్లు ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు.
వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్వరం వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం కాస్తా చివరకు తోపులాటకు దారితీసింది. సబితా ఇంద్రారెడ్డి వారించిన కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. గొడవ కారణంగా కార్యక్రమంలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

