ముంబై పార్కులో జంటపై దాడి.. మైనర్లపై కేసు నమోదు!

కలం, వెబ్ డెస్క్ : ముంబైలోని కుర్లా వెస్ట్ పరిధిలోని చిరాగ్ నగర్ సమీపంలో ఉన్న ప్రమోద్ మహాజన్ గార్డెన్ వద్ద ఒక యువకుడు, యువతిపై ఓ వర్గానికి చెందిన సుమారు ఎనిమిది నుంచి పది మంది యువకుల బృందం దాడి చేసిన ఘటన (Mumbai Assault) కలకలం రేపింది. ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్ సమీపంలోని ఈ పబ్లిక్ గార్డెన్‌లో నవంబర్ 20న ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

మొదట మాటల గొడవతో మొదలైన వివాదం ఆ తర్వాత దాడికి దారితీసింది. యువకుడిపై కర్రలతో కొట్టడంతో పాటు ముఖంపై గుద్దారని, యువతి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేదని వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చింది. బాధిత యువకుడు ఘటనను మొబైల్‌లో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించగా గుంపు మరింత రెచ్చిపోయి ఫోన్ లాక్కునేందుకు యత్నించిందని, అనంతరం ఒకరు పెద్ద రాయిని విసిరారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పాటు ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘాట్‌కోపర్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద ఎనిమిది మంది మైనర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదుగురు మైనర్ల తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నిందితులైన మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>