Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాద్రి రామయ్య ఆదాయం ఎంతో తెలుసా?

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో(Bhadrachalam Temple) భక్తులు సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నానికి పూర్తి అయింది. జనవరి 30వ తేదీ నుంచి నేటి వరకు భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ ఈవో దామోదర్ రావు పర్యవేక్షణలో, కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కించారు.

సుమారు నెలా పది రోజుల ఆదాయం ఒక కోటి ఐదు లక్షల తొంబై నాలుగువేల తొంబై రూపాయలు(1,05,94,090). కాగా, బంగారం 80 గ్రాములు, వెండి 650 గ్రాములు వచ్చాయి. యూఎస్ డాలర్లు 91, వియత్నాం కరెన్సీ డోంగ్స్ 5,000తో పాటు కెనడా, ఒమన్, మలేసియా, మాల్దీవ్స్, న్యూజిలాండ్, యూఏఈ కరెన్సీ కూడా కొద్ది మొత్తంలో వచ్చినట్లు ఆలయ(Bhadrachalam Temple) అధికారులు తెలిపారు.

Read Also: వెలుగుమట్ల బాధితులకు కవిత భరోసా

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>