ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం (Kothagudem) కార్పొరేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయురాలి అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగేశ్వర రావు, కవిత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఫ్యాన్​కు కవిత ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నట్లు సోమవారం ఉదయం ఆమె బంధువులకు భర్త సమాచారమిచ్చారు. వాళ్లు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవనీ, భర్త నాగేశ్వరరావుకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉండడమే గొడవలకు ప్రధాన కారణమని కవిత తరపు బంధువులు అంటున్నారు. ఆ కారణంతోనే నాగేశ్వరరావు కవితను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

అందువల్లనే నిన్న రాత్రి చనిపోతే ఇవ్వాళ ఉదయం వరకూ తమకు సమాచారం ఇవ్వలేదని కవిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి ఒంటి మీద నగలు కూడా భర్త తరపు బంధువులు మాయం చేశారని, కాబట్టి కవిత మృతికి కారణమైన నాగేశ్వరరావుకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు (Kothagudem) నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు.

Read Also: రాజకీయాల్లో మార్పు రావాలి.. డబ్బే ముఖ్యం కాదు : మహేష్ గౌడ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>