కలం, వెబ్ డెస్క్ : టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (Mahesh Goud) ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు పూర్తిగా కలుషితం అవుతున్నాయని చెప్పారు. చాలా మంది రాజకీయ నేతలు ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారని.. అది రాజకీయాలకు మంచిది కాదన్నారు. అలాంటి వారి వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయని చెప్పారు. రాజకీయాల్లో పూర్తి స్థాయి ప్రక్షాళన అవసరం అన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా చూస్తున్నామని.. పారదర్శకంగా పాలన అందిస్తున్నట్టు తెలిపారు మహేష్ గౌడ్.
Read Also: ఢిల్లీ అల్లర్ల కేసు.. షర్జీల్ ఇమామ్‌కు బెయిల్
Follow Us On : WhatsApp

