Mobile Popup Ad
Mobile Popup Ad

బుగ్గారంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన కొప్పుల ఈశ్వర్

కలం, కరీంనగర్ బ్యూరో: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) బుగ్గారం మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను  పరామర్శించారు. బుధవారం బుగ్గారం మండలం (Buggaram Mandal) లో పర్యటించిన ఆయన, ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన నక్క మల్లవ్వ, రామగిరి లక్ష్మణ్, కప్పల పెద్ద గంగారం కుటుంబ సభ్యులను కలిసి.. వారి పరిస్థితిని తెలుసుకుని ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో పార్టీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ కో అప్షన్ మెంబర్ రహమాన్, ప్రజాప్రతినిధులు మాసర్తి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>