రేవంత్‌ రెడ్డిపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ (Konda Surekha) ఎపిసోడ్ చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు, పార్టీకి నష్టం చేకూరుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కేవలం తానే మాత్రమే కాకుండా మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు కూడా సీఎం తీరుపై అసంతృప్తితో ఉన్నారని ఆమె పరోక్షంగా కామెంట్స్ చేశారు.

ప్రభుత్వ పనితీరుపై కూడా సురేఖ ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. తనను రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ కూడా కోరలేదని స్పష్టం చేశారు. బీసీలకు ఒక న్యాయం, ఇతర సామాజిక నేతలకు మరోక న్యాయమైని గట్టిగా ప్రశ్నించారు.

అయితే కొండా సురేఖ (Konda Surekha) వ్యవహరంపై త్వరగా తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్‌కు చెప్పినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసీసీ ఫైనల్ నిర్ణయం తీసుకోనుండటంతో సురేఖ ఎపిసోడ్ మరింత ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలను బట్టి, ఆమెను దాదాపుగా కేబినెట్ నుంచి తొలగిస్తారని ఢిల్లీ నుంచి పరోక్షంగా సంకేతాలు వచ్చాయని చెప్పక తప్పదు.

Also Read : 1000 రోజుల పాలన క్రిమినల్ వేస్ట్: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>