కవితపై అనుచిత పోస్టులు.. పీ‌ఎస్‌లో ఫిర్యాదు

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ (TRS) జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ​ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్, X (ట్విట్టర్) వంటి సోషల్ మీడియా వేదికల్లో తమ నాయకురాలి గౌరవానికి భంగం కలిగించేలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై చట్టపరంగా, శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. ​ప్రజలకు రక్షణ కల్పించి, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన పవిత్రమైన పోలీస్ ఉద్యోగంలో ఉండి ఈ విధంగా వ్యవహరించడం యావత్ మహిళా లోకాన్ని అవమానించడమేనని మండిపడ్డారు.

కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి..

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, కానిస్టేబుల్ అనిల్ వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను కూడా వెలికితీయాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లింగంపల్లి నాగరాజు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, మానకొండూర్ నియోజకవర్గం ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, చొప్పదండి నాయకులు మ్యాకల తిరుపతి, జిల్లా నాయకులు రంగరవేణి లక్ష్మణ్, కుతాడి శ్రీనివాస్, శ్రీరాముల రమేష్, బసవేణి రాజేందర్, ఎం.డి. హుస్సేన్, ఎం.డి. రాజీ, మడిపల్లి వినీత్, బండారి అభిరామ్, జిల్లా మహిళా నాయకురాళ్లు జంగ అపర్ణ, ఆసియా సుల్తానా, పల్లె శారద, తుట్తేవార్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : అయోధ్య ట్రస్ట్ సీఈవోగా జితేంద్ర మిశ్రా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>