కలం, నిర్మల్: జిల్లాలోని ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ (Patha Yellapur) గ్రామంలో సర్పంచ్ ఏలేటి ప్రశాంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఉపయోగపడేలా అంబులెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1000 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడం మానుకుని ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని గుర్తించాలని సూచించారు.

