వేయిస్తంభాల ఆలయ కమిటీపై కొండా సురేఖ ఫైర్

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ వేయిస్తంభాల దేవాలయ కమిటీపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో శివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికలో ప్రోటోకాల్ పాటించకపోవడం మంత్రి ఆగ్రహానికి కారణమైంది.

వేయిస్తంభాల దేవాలయంలో శివరాత్రి వేడుకల ఆహ్వాన పత్రికపై కమిటీ సభ్యులు తొలుత స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేరుపెట్టి తర్వాత మంత్రి పేరు ముద్రించారు. ఈ విషయమై మంత్రి వేయిస్తంభాల ఆలయ కమిటీపై సీరియస్ అయ్యారు. ఆలయ కమిటీకీ నోటీసులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా కారకులపై చర్యలకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>