ఏడాదికే కోటీశ్వరుడైన బాలుడు.. ఈ చిన్నారి బర్త్‌డే గిఫ్ట్‌లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

కలం, వెబ్ డెస్క్: సాధారణంగా చిన్న పిల్లలకు బొమ్మలు, బట్టలు గిఫ్ట్‌గా ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), అలీగఢ్‌కు చెందిన శివాయ్ అనే బాలుడు తన ఫస్ట్ బర్త్ డేకు కోట్లాది రూపాయలైన ఆస్తులను సొంతం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను బాలుడి బాబాయ్ అఖిలేష్ చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ బుడ్డొడికి ఏకంగా ఓ రహదారి హైవే పక్కన విలువైన ప్లాట్‌ను బహుమతిగా ఇచ్చారు.

భూమితో పాటు శివాయ్‌కు భారీగా నగదు, బంగారు ఆభరణాలను కుటుంబ సభ్యులు అందజేశారు. సుమారు 11 లక్షల రూపాయల నగదు, 20 గ్రాముల బంగారు గొలుసు, అర కిలో వెండిని బహుమతిగా ఇచ్చారు. వీటితోపాటు వెండి గాజులు, దేవుడి విగ్రహాలు కుప్పలు తెప్పలుగా ఇచ్చారు. ఒక సామాన్య వ్యక్తి జీవితాంతం కష్టపడినా సంపాదించలేని డబ్బును ఈ చిన్నారి తన మొదటి పుట్టినరోజు నాడే సొంతం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ సంబరాలు కేవలం బాలుడికే పరిమితం కాలేదు. శివాయ్ తల్లికి 35 గ్రాముల బంగారు నెక్లెస్, ఇతర ఆభరణాలను కానుక (Gifts)గా ఇచ్చారు. అలాగే బంధుమిత్రుల పట్ల కూడా ఈ కుటుంబం తమ ఉదారతను చాటుకుంది. పుట్టినరోజు వేడుకకు వచ్చిన అతిథులకు ఖరీదైన బట్టలను పంపిణీ చేశారు. ప్రస్తుతం రిచ్ కిడ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read Also: వేయిస్తంభాల ఆలయ కమిటీపై కొండా సురేఖ ఫైర్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>