కలం, యాదగిరిగుట్ట: స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శనీయమని అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ అన్నారు. సోమవారం బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణంలోని అఖిల భారత పద్మశాలి నిత్యన్నాసత్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదగిరిగుట్ట అఖిల భారత పద్మశాలి అన్నసత్రంలో సుంచు నాగభూషణం అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. ఆయన సేవలను గుర్తించి ప్రతి ఏటా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బాపూజీ సేవలు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. కొండా లక్ష్మణ్ ఆశయాలను భావితరాలకు అందించడమే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సత్రం కోశాధికారి బడుగు మల్లేశం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఎర్రగుంట్ల వెంకటేష్, సత్రం సహాయ కార్యదర్శి గుజ్జ బలరాం, మార్గం యాదగిరి, బొమ్మ సూర్య నారాయణ, కైరంకొండ మధు, గుజ్జ నిర్మల, అంకం నరసింహ, పులగం భిక్షపతి, ఎక్కాలదేవి నరహరి, మెరుగు మధు, మండల శ్రీనివాస్, ఎక్కలదేవి భాస్కర్, మెరుగు అనిల్, వల్లకాటి సురేష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

