ఎండమావులుగా పాలమూరు రిజర్వాయర్లు: ఆంజనేయ గౌడ్

కలం,‌ జోగులాంబ గద్వాల: కృష్ణా నది ప్రవాహాన్ని కుట్రపూరితంగా ఏపీకి వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పాలమూరు రిజర్వాయర్లను ఎండమావులుగా మార్చేశారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ (Anjaneya Goud) విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా నదీ జలాల అంశంలో రేవంత్ సర్కార్ విషపూరిత ధోరణిని అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ఉమ్మడి పాలమూరులో 50 టీెంసీల నిల్వ సామర్థ్యంతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులను కావాలనే కాంగ్రెస్ పాలకులు ఖాళీ కుండల్లా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

కుప్పం ప్రాంతానికి కప్పం..

జూరాల ఆధారిత రిజర్వాయర్లను ఎండబెట్టి కుప్పం ప్రాంతానికి కప్పం కట్టేందుకు నడిగడ్డ రైతులతో సీఎం రేవంత్ చెలగాటం ఆడుతున్నారని ఆంజనేయ గౌడ్ విమర్శించారు. ఎండిపోతున్న పంటలను చూసి గుండెలు మండిన రైతులు పోరాడుతుంటే, జూరాల నలువైపులా పోలీస్ జులుంకు దిగడం దారుణమన్నారు. దాడికి బాధ్యత వహించి మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీవారి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి న్యాయం జరిగేలా త్వరలోనే గద్వాల పట్టణంలో “పల్లె పిడికిలి పోరు సభ”ను ప్రభంజనంలా నిర్వహిస్తామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>