పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

కలం, సారంగాపూర్: సారంగాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) 14వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరంలో, తెలంగాణ ప్రజల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, కులస్తులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>