కలం, వెబ్ డెస్క్ : గోదావరి జిల్లాల ప్రకృతి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు పర్యాటకులకు మంచి అవకాశం లభించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ ఈ హెలికాప్టర్ రైడ్ (Helicopter Ride)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 5 వేల రూపాయలకే ఈ విమాన విహార సౌకర్యాన్ని కల్పించింది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఈ హెలికాప్టర్ రైడ్ ప్రారంభం కానుంది.
ఈ ప్రయాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం, విశాలమైన సాగర తీరం, లైట్ హౌస్ వంటి ప్రాంతాలను ఆకాశం నుంచి తిలకించవచ్చు. ముఖ్యంగా గోదావరి పాయలు కలిసే అన్న చెల్లెళ్ల గట్టుతో పాటు, కోనసీమ పచ్చని కొబ్బరి తోటల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. పండుగ మూడు రోజుల పాటు ఈ హెలికాప్టర్ రైడ్ (Helicopter Ride) అందుబాటులో ఉండనుంది.
Read Also: రాజ్‌కోట్‌లో రప్పా రప్పా ఆడించిన రాహుల్..
Follow Us On: X(Twitter)


