Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్ బంకుల్లో భారీ మోసం.. 5 ఏళ్లలో 21 వేలకు పైగా కేసులు

కలం, వెబ్ డెస్క్: మీరు పెట్రోల్ బంకుల్లో చెల్లించిన డబ్బుకు తక్కువ ఆయిల్ వస్తుందని ఎప్పుడైనా అనుమానించారా? లీగల్ మెట్రాలజీ శాఖ నమోదు చేసిన కేసులు చూస్తే అనుమానం నిజమేననిపిస్తుంది. సామాజిక కార్యకర్త రాబిన్ జక్కూస్ దాఖలు చేసిన ఆర్‌టీఐ (RTI) సమాచారం ప్రకారం.. 2020 నుంచి 2025 జూన్ వరకు హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో మొత్తం 21,718 పెట్రోల్ బంకులపై కేసులు నమోదయ్యాయి. కేవలం హైదరాబాద్‌లోనే 8,341 బంకుల్లో వినియోగదారులు భారీగా మోసపోయారు. చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో భారీ అక్రమాలు బట్టబయలయ్యాయి.

ఈ మోసాలకు సంబంధించి లీగల్ మెట్రాలజీ శాఖ భారీగా జరిమానాలు విధించింది. హైదరాబాద్‌లో రూ. 5 కోట్లు, నిజామాబాద్‌లో రూ. 3.66 కోట్లు, నల్గొండలో రూ. 4.66 కోట్ల మేర జరిమానాలు వసూలయ్యాయి. జరిమానాలు కడుతున్నా మోసాలు మాత్రం ఆగడం లేదని రాబిన్ పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి నెలా జోన్ల వారీగా మోసాలపై నివేదికలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. పదే పదే అక్రమాలకు పాల్పడే వారి లైసెన్సులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>