విజయవాడ దుర్గగుడిలో స్మార్ట్ సేవలు.. భక్తుల సౌకర్యానికి కొత్త దారి!

కలం, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం (Durga Temple) లో భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు త్వరలో ఏఐ (AI) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. దుర్గగుడికి ప్రతిరోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాలు, పండుగలు, దసరా సమయంలో ఇంద్ర కీలాద్రి మొత్తం కిటకిటలాడుతుంది. అయితే రద్దీని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఆలయంలో త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బొర్రా గాంధీ తెలిపారు.

దర్శనం నుంచి పార్కింగ్ వరకు అన్నీ స్మార్ట్ గానే..

దర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉందో ఇకపై భక్తులకు మొబైల్‌లోనే సమాచారం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా పార్కింగ్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో కూడా మొబైల్ నుంచే తెలుకోవచ్చన్నారు. లడ్డూ కౌంటర్ వద్ద ఎంత వెయిటింగ్ ఉంది. ఇలాంటి వివరాలు AI ద్వారా తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు ఆలయంలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం, అనుమానాస్పద కదలికలను కనిపెట్టడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం కోసం కూడా AI కెమెరాలు ఉపయోగించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

తిరుమలలో ఏ విధంగా అయితే టెక్నాలజీ వినియోగం వల్ల భక్తులకు సౌకర్యాలు అందుతున్నాయో అదే తరహాలో దుర్గగుడిని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టెక్నాలజీని ఉపయోగించి రద్దీని నియంత్రించడంతో పాటు దర్శనాన్ని సులభతరం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.

అయితే అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా చేస్తే బాగుంటుంది అని కొందరు భక్తులు చెబుతున్నారు. సంప్రదాయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరికొందరు భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల భావాలకు అనుగుణంగా, కాలానికి తగ్గట్టుగా మారుతున్న దేవాలయ వ్యవస్థలో ఇప్పుడు ఇంద్రకీలాద్రి కూడా కొత్త అడుగు వేయబోతోంది. ఆధ్యాత్మికతకు టెక్నాలజీ జోడిస్తే… భక్తులకు మరింత సౌకర్య వంతమైన దర్శనం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>