epaper
Wednesday, February 18, 2026
epaper

హైదరాబాదుకు దీటుగా నల్లగొండ కార్పొరేషన్‌ : మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. శుక్రవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4, 5, 21, 20, 41, 47, 48 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌ (Nalgonda Municipal Corporation) ను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ మున్సిపల్ అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభుత్వం కుటుంబంలో పదవులు పంచుకున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థుల చావుకు కారణమైన కేసీఆర్ ఎలా జాతిపిత అవుతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటుంటే చలించి తాను మంత్రి పదవికే రాజీనామా చేశానని గుర్తు చేశారు. కెసిఆర్ పాలనలో దొరపాలన.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి డివిజన్‌లోని సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హాఫిజ్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, 4వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బోగరి వైష్ణవి, 5వ డివిజన్ అభ్యర్థి పున్న జ్ఞానేశ్వరి గణేష్, 21వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ ఇబ్రహీం, 20వ డివిజన్ అభ్యర్థి అల్లి సుభాష్, 42వ డివిజన్ అభ్యర్థి పబ్బు సాయిశ్రీ,41వ డివిజన్ అభ్యర్థి కేసాని వేణుగోపాల్ రెడ్డి, 47 డివిజన్ కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్, 48వ డివిజన్ అభ్యర్థి యామ కవిత దయాకర్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: బీఆర్ఎస్‌కు బ్యాడ్ టైమ్.. మున్సిపల్ ఎన్నికల్లో నిరసన సెగ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>