epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణలో పవన్ కల్యాణ్ పర్యటన రద్దు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  పర్యటన రద్దు అయ్యింది. మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేయాలని పవన్ కల్యాణ్ భావించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు, ఎల్లుండి (ఫిబ్రవరి 7,8) తేదీల్లో తెలంగాణలోని పలు చోట్ల పవన్ కల్యాణ్ పర్యటించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 336 స్థానాల్లో జనసేన పార్టీ (Janasena) పోటీ చేస్తున్నది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతోంది. అయితే తాజాగా పవన్ కల్యాణ్ పర్యటన రద్దైంది. తెలంగాణ బీజేపీ నేతల ఒత్తిడితోనే ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటిస్తే బీజేపీకే నష్టమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.

జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం కూడా చాలా మంది నేతలకు ఇష్టం లేదని సమాచారం. గతంలో అనేక సందర్భాల్లో పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తాను వారం రోజులు అన్నం ముట్టుకోలేదని.. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆయన మాట్లాడారు. ఇటీవల కోనసీమకు తెలంగాణ రైతుల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించారు. దీంతో పవన్ ఒకవేళ తెలంగాణలో పర్యటిస్తే తమకు నష్టం కలుగుతుందేమోనని బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ కల్యాణ్ మీద కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు

ఆంధ్రా లీడర్‌గానే గుర్తింపు

ఇక పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ఆంధ్రానేతగానే గుర్తింపు ఉంది. తెలంగాణలోనూ పవన్ కల్యాణ్‌కు భారీగా అభిమానులు ఉన్నప్పటికీ ఓటింగ్ ఎంత ఉంది ? అన్న విషయంలో క్లారిటీ లేదు. జనసేన జాతీయ స్థాయిలో, ఏపీలో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నది. దీంతో తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ విస్తరించాలని భావిస్తోంది. అయితే బీజేపీ, జనసేన పొత్తుతో తమకు నష్టం ఎక్కువని కాషాయ నేతలు భావిస్తున్నారని సమాచారం. పవన్ ప్రచారం చేయకపోయినా మంచిదేగానీ.. తెలంగాణలో అడుగు పెడితే అది చేటు చేస్తుందనే ఆ పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన రాకపోతేనే ఎక్కువ ఓట్లు పడతాయనే కొందరు బీజేపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు. బీజేపీ నేతలకు ఇష్టం లేకపోవడంతో పవన్ కల్యాణ్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు సమాచారం.

Read Also: బీఆర్ఎస్‌కు బ్యాడ్ టైమ్.. మున్సిపల్ ఎన్నికల్లో నిరసన సెగ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>