కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి (Medipalli) గ్రామానికి వెళ్లే రహదారి అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన మంత్రి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రూ.2 కోట్లతో జాతీయ రహదారి ఎన్ హెచ్ – 44 నుంచి మేడిపల్లి వరకు ఉన్న రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయడంతో పాటు మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.

