epaper
Wednesday, February 18, 2026
epaper

నా చివరి శ్వాసదాకా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తా : కోమటిరెడ్డి

కలం, నల్లగొండ : నల్లగొండ ప్రజలతో తనకు విడదీయరాని ఆత్మీయబంధం ఉందని, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోలేనిదని మంత్రి కోమటి రెడ్డి (Komatireddy) వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల తరుఫున మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మొదట చర్లపల్లి 15వ డివిజన్ అభ్యర్థి పెరిక నాగరాజు, మర్రిగూడ 14 డివిజన్ అభ్యర్థి బొజ్జ శంకరయ్య, 12వ డివిజన్ అభ్యర్థి మామిడి కార్తీక్, 27 డివిజన్ అభ్యర్థి సట్టు నాగమణి శంకర్, 28వ డివిజన్ అభ్యర్థి గుండెబోయిన పుష్పలత వెంకన్న, 29వ డివిజన్ అభ్యర్థి గులాబ్ మహమ్మద్ షఫిక్, 26వ డివిజన్ అభ్యర్థి అసిమా సుల్తాన్( బషీర్ ), 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ గౌడ్ తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు.

నల్లగొండనే తన ఇల్లు అని.. పేదప్రజల మధ్యలో ఉండడం నాకిష్టం అని మంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిలో తన కొడుకును చూసుకుంటానని, వారు ఉన్నత చదువులు చదివి ప్రయోజకులైతే సంతోషిస్తానని చెప్పారు కోమటిరెడ్డి (Komatireddy) వెంకట్ రెడ్డి అన్నారు. అందుకే ప్రతీక్ పేరు మీద ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తన చివరి శ్వాస వరకు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని, నల్లగొండను హైదరాబాద్ లాంటి నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి క్లీన్ స్వీప్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి అధిక నిధులు తెస్తానని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరవేస్తానని, అభివృద్ధిలో నల్లగొండను నెంబర్ వన్ గా నిలుపుతానని అన్నారు. ఓటు కోసం ప్రతి పక్షాలు చెప్పే మాయమాటలు నమ్మొద్దని ఓటర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాను ఉండగా నల్లగొండలో శాంతి భద్రతలకు విఘాతం కలుగదనీ,అన్ని వర్గాల ప్రజలు తన వాళ్లే అని మంత్రి పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పాశం రామ్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు మామిడి కార్తీక్, సట్టు నాగమణి శంకర్, గుండబోయిన పుష్పలత వెంకన్న, గులాబ్ మహమ్మద్ షఫిక్, అసిమా సుల్తాన్( బషీర్ ), మారగోని నవీన్ గౌడ్, పలువురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>