కోమలి మృతి కేసు: అఖిల్ ఫోన్‌లో కీలక డేటా సేకరణ !

కలం, వెబ్​ డెస్క్​ : ప్రముఖ యూట్యూబర్ కోమలి (Youtuber Komali) ఆత్మహత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన రాయదుర్గం పోలీసులు ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. తన కుమార్తె మరణానికి అఖిల్ వేధింపులే కారణమని కోమలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సుమారు 12 గంటల పాటు వివిధ కోణాల్లో అతడిని ప్రశ్నించారు.

ఈ విచారణలో భాగంగా పోలీసులు అఖిల్‌కు సంబంధించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని కీలక సమాచారాన్ని సేకరించారు. కోమలి (Komali)తో జరిపిన చాటింగ్ వివరాలు, కాల్ డేటా ఆధారంగా కేసును విశ్లేషిస్తున్నారు. పోలీసుల సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అఖిల్ రెడ్డి మీడియా కంటపడకుండా ముఖం చాటేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు ఈ డేటా ఆధారంగా తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.

Read Also: లాడ్జిలో అర్ధ‌రాత్రి అగ్ని ప్ర‌మాదం.. వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>