లాడ్జిలో అర్ధ‌రాత్రి అగ్ని ప్ర‌మాదం.. వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం

క‌లం, వెబ్ డెస్క్‌: క‌డ‌ప‌ (Kadapa)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బుధ‌వారం అర్ధ‌రాత్రి ఓ లాడ్జిలో అగ్ని ప్ర‌మాదం (Fire Accident) జ‌రిగి ఓ వ్య‌క్తి స‌జీవ ద‌హ‌న‌మ‌య్యాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. జిల్లాలోని రాజంపేట(Rajampet) పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు ఉన్న‌ దీప్ లాడ్జిలో రాత్రి ఒంటి గంట‌కు షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగింది. క్ష‌ణాల్లోనే మంట‌లు లాడ్జి మొత్తం వ్యాపించాయి. ప్ర‌మాద స‌మ‌యంలో లాడ్జిలో 39 మంది ఉన్నారు. మంట‌లు చూసి అంద‌రూ భ‌యాందోళ‌న‌తో ప‌రుగులు పెట్టారు. అయితే అప్ప‌టికే మంట‌లు, ద‌ట్ట‌మైన పొగ లాడ్జి మొత్తం క‌మ్ముకుంది.

దీంతో కొంద‌రు లాడ్జి ఫ‌స్ట్‌ ఫ్లోర్ నుంచి నుంచి కిటికీల ద్వారా కిందికి దూకేశారు. దాదాపు అంద‌రూ స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కానీ, ఒక వ్య‌క్తి లాడ్జిలో నుంచి బ‌య‌ట‌కు రాలేక‌ మంట‌ల్లో చిక్కుకొని స‌జీవ ద‌హ‌న‌మ‌య్యాడు. మృతుడిని రాజంపేటకు చెందిన శ్రీనివాసులు(35)గా గుర్తించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు.

Read Also: రైల్వే టికెట్ క్ల‌ర్క్‌కి బుద్ధి చెప్పిన యువ‌తి.. ఉద్యోగ‌మే ఊడిపోయింది!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>