Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీలోకి కొడాలి నాని.. ఒక్క ఫొటోతో పుకార్లకు చెక్..!

కలం, వెబ్ డెస్క్ : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani ) రాజకీయ భవిష్యత్ పై కొద్ది రోజులుగా పలు ప్రచారాలు జరుగుతున్నాయి . 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని రాజకీయాలకు కొంత దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతారని ఊహాగానాలు వెలువడిన వేళ మరో ప్రచారం తెరపైకి వచ్చింది. ఇటీవల మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ మాతే కుటుంబంతో కలిసి తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను దర్శించుకున్న వేళ సదరు బీజేపీ నేతతో కొడాలి నాని బహిరంగంగా కనిపించారు. దీంతో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.

అయితే తాను బీజేపీలో చేరబోతున్నారంటూ వాస్తున్న ప్రచారానికి తాజాగా కొడాలి నాని చెక్ పెట్టారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన కలిశారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫోటోతో తాను తాను వైఎస్ జగన్ వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు , పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై చర్చించినట్లు కొడాలి నాని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>