ఏపీ పీజీఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. విద్యార్థులకు లోకేశ్ శుభాకాంక్షలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)  ఏపీ పీజీఈసెట్ 2026 (APPGECET 2026) ఫలితాలను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 9,990 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 9,320 మంది అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 93.29గా నమోదైంది. విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలను పొందే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన విద్యార్థులందరికీ నారా లోకేశ్ అభినందనలు తెలియజేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>