ఎస్‌ఆర్‌హెచ్‌ను చిత్తు చేసిన కేకేఆర్..

కలం, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హోంగ్రౌండ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్.. ఒంటరి పోరాటం చేసి ఎస్‌ఆర్‌హెచ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించినా అతడి పోరాటం వృథా అయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే కేకేఆర్ ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో రఘువంశీ (Raghuvanshi) తనదైన ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో రహానే కూడా 43 పరుగులతో రాణించాడు. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మినహా ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో ఏ ఒక్కరూ సరైన పర్ఫార్మెన్స్‌ను కనబరచలేదు. అభిషేక్ శర్మ 15 పరుగులకే వెనుతిరగగా, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 10 పరుగులతో సరిపెట్టుకున్నారు. ఇక మిగిలిన ఏ బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. ఇదే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమిని శాసించింది.

అదే సమయంలో కేకేఆర్ జట్టులో మాత్రం ఓపెనర్లు అజింకా రహానే, ఫిన్ అలెన్ పర్వాలేదనిపించే ఆరంభాన్ని అందించారు. 49 పరుగుల దగ్గర ఫిన్ అలెన్ ఔట్ కావడంతో మైదానంలోకి అడుగు పెట్టిన రఘువంశీ అద్భుతీమైన ఆటతీరుతో చెలరేగాడు. 47 బంతుల్లో 59 పరుగులు చేసి శివాంగ్ కుమార్ బౌలింగ్‌తో వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత రింకూ సింగ్, కామెరన్ గ్రీన్ మ్యాచ్‌ ఆఖరి వరకు నిలిచారు. బౌలింగ్‌లో ఈసారి వరుణ్ చక్రవార్తి మెరిశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 36 పరుగుల ఇచ్చినా 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో తన మార్క్ చూపించుకున్నాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 28 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇషాన్ కిషన్ (42 పరుగులు, 29 బంతులు) అతనికి చక్కని సహకారం అందించాడు. అయితే, వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. అభిషేక్ శర్మ (15), హెన్రిచ్ క్లాసెన్ (11), కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (10) మినహా మిగిలిన ఎనిమిది మంది బ్యాటర్లు కనీసం డబుల్ డిజిట్ స్కోరు కూడా అందుకోలేకపోయారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి 3 కీలక వికెట్లు పడగొట్టి హైదరాబాద్ వెన్ను విరిచాడు. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి తలా రెండు వికెట్ల పడగొట్టి రాణించారు.

166 పరుగుల లక్ష్య ఛేదనలో కేకేఆర్ ఓపెనర్లు అజింకా రహానే (43 పరుగులు, 36 బంతులు), ఫిన్ అలెన్ (29 పరుగులు, 13 బంతులు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 3.6 ఓవర్లలోనే 49 పరుగులు జోడించిన తర్వాత ఫిన్ అలెన్ అవుట్ కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రఘువంశీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఆఖర్లో రింకూ సింగ్ (22 నాటౌట్), కామెరన్ గ్రీన్ (3 నాటౌట్) నిలకడగా ఆడి మరో 1.4 ఓవర్లు మిగిలి ఉండగానే 169/3 స్కోరుతో విజయాన్ని ఖరారు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, షకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీసినప్పటికీ, పరుగులను నియంత్రించడంలో విఫలమయ్యారు. ఈ ఓటమితో హోంగ్రౌండ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ (KKR vs SRH) అభిమానులకు నిరాశే మిగిలింది.

Read Also: AI సర్వర్ల భద్రతకు.. ‘షాడో AI’, ‘డేటా పాయిజనింగ్’ ముప్పు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>