ఆండ్రీ రస్సెల్ జెర్సీ నంబర్ 12కు కేకేఆర్ రిటైర్మెంట్

కలం, స్పోర్ట్స్ : కోల్‌కతా నైట్ రైడర్స్ దిగ్గజం, “పవర్ హిట్టర్” ఆండ్రీ రస్సెల్‌కు ఆ ఫ్రాంచైజీ అత్యున్నత గౌరవాన్ని అందించింది. రస్సెల్ ధరించిన ఐకానిక్ నంబర్ 12 జెర్సీని శాశ్వతంగా రిటైర్ చేస్తున్నట్లు కేకేఆర్ యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ‘నైట్స్ అన్‌ప్లగ్డ్ 3.0’ వేడుకలో ఈ అప్‌డేట్ వెలువడింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో అభిమానులు, ప్రస్తుత ఆటగాళ్లు, మాజీ దిగ్గజాల సమక్షంలో వేదికపైకి వచ్చిన కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. రస్సెల్ గౌరవార్థం ఈ నంబర్‌ను ఇకపై ఎవరికీ కేటాయించబోమని చెబుతూ, ఫ్రేమ్ చేసిన జెర్సీని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా సభికులంతా నిలబడి రస్సెల్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.

2025 సీజన్ తర్వాత ఆటకు స్వస్తి పలికిన ఈ జమైకా వీరుడు, కేకేఆర్‌తో 11 సీజన్ల పాటు అనుబంధాన్ని కొనసాగించారు. 2014 నుండి 2025 వరకు (2017 మినహా) జట్టులో అంతర్భాగంగా ఉన్నారు. తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 140 మ్యాచ్‌లు ఆడగా, అందులో 133 మ్యాచ్‌లు కోల్‌కతా తరపునే ఆడటం విశేషం.

రస్సెల్ రికార్డులు:

పరుగులు: 174.18 స్ట్రైక్ రేట్‌తో 2,651 పరుగులు.

సిక్సర్లు : మొత్తం 223 భారీ సిక్సర్లు.

వికెట్లు: బౌలింగ్‌లోనూ రాణిస్తూ 123 వికెట్లు పడగొట్టారు.

టైటిల్స్: 2014, 2024లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.

మైలురాయి: ఐపీఎల్ చరిత్రలో 2000 పరుగులు, 100 వికెట్లు తీసిన అతికొద్ది మంది ఆల్ రౌండర్లలో రస్సెల్ ఒకరు.

మైదానంలో ఆటగాడిగా వీడ్కోలు పలికిన రస్సెల్, ఇకపై డగౌట్‌లో కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఐపీఎల్ 2026 (IPL 2026) కోసం కేకేఆర్ ‘పవర్ కోచ్‌’గా ఆయన బాధ్యతలు చేపట్టారు. హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో వంటి హేమాహేమీలతో కలిసి రస్సెల్ తన అనుభవాన్ని కుర్రాళ్లకు పంచనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>