కుక్క కోసం నెలకు రూ.15 వేల ఖర్చు.. బెంగళూరు కపుల్ లైఫ్ స్టైల్‌పై చర్చ

కలం, వెబ్ డెస్క్: బెంగళూరుకు (Bengaluru) చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు తమ పెంపుడు కుక్క (Pet Dog) కోసం నెలకు ఏకంగా రూ.15,000 వరకు ఖర్చు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గోక్వెస్ట్ వ్యవస్థాపకుడు గగన్ అరోరా ఈ విషయాన్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. ఆ దంపతుల ఇంట్లో కుక్క కోసం ప్రత్యేకంగా ఆహారం, ప్రోబయోటిక్ సప్లిమెంట్లు, విలాసవంతమైన వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వారు తమ నిత్యావసరాల కంటే తమ పెంపుడు జంతువు సంరక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనిపై ఆ దంపతులు నవ్వుతూ తమకంటే కుక్కకే ఎక్కువ ఖర్చు చేస్తామని అంగీకరించారు కూడా.

ఈ ధోరణిని అరోరా ‘డింక్వాడ్’ (DINKWAD – డబుల్ ఇన్‌కం, నో కిడ్స్, విత్ ఏ పెట్ డాగ్) అని ట్రెండ్‌గా అభివర్ణించారు. అంటే పిల్లలు లేకుండా ఇద్దరూ సంపాదిస్తూ, ఒక కుక్కను పెంచుకునే దంపతులు అని అర్థం. ప్రస్తుత కాలంలో చాలా మంది పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా, తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది వారి వ్యక్తిగత ఇష్టమని సమర్థిస్తుంటే, మరికొందరు ఇంత భారీ ఖర్చు అవసరమా అని చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>