మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల

కలం, నల్లగొండ : నల్లగొండ(Nalgonda) లోని ఎంజీయూ (MG University) పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన బీఈడీ (B.Ed) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బీఈడీ ఒకటో, మూడో సెమిస్టర్ విద్యార్థుల ఫలితాలను ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి విడుదల చేశారు.

మొదటి సెమిస్టర్‌లో 2601 మంది విద్యార్థులు హాజరవ్వగా, అందులో 1982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారు. మూడో సెమిస్టర్‌లో 2713 మంది విద్యార్థుల్లో 2440 మంది ఉత్తీర్ణత సాధించి, 269 మంది ప్రమోట్ అయ్యారు. అలాగే, నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు అయ్యాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఎంజీయూ (MG University) ఫలితాల విడుదల కార్యక్రమంలో డాక్టర్ జీ.ఉపేందర్ రెడ్డి, పర్సనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ డి.సంధ్యారాణి, డాక్టర్ జీ.లక్ష్మీప్రభ, డాక్టర్ ప్రవళిక, డాక్టర్ ఎస్.కళ్యాణి, డాక్టర్ బిక్షమయ్య పాల్గొన్నారు.

Read Also: కుక్క కోసం నెలకు రూ.15 వేల ఖర్చు.. బెంగళూరు కపుల్ లైఫ్ స్టైల్‌పై చర్చ

Follow Us On: X(Twitter)

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>