epaper
Wednesday, February 18, 2026
epaper

కాంగ్రెస్ – బీఆర్ఎస్ తోడు దొంగలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కలం, మెదక్ బ్యూరో : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ సమయంలో ఫామ్ హౌస్ లోనే ఉన్నాడని, మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ రామాయంపేటను మాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట లో కిషన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం లో పాల్గొన్నారు. ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ పదేళ్లు పాలించినా అభివృద్ధి చేయకుండా ఆ పార్టీ నాయకులు నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు.

ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి.. వాటిలో ఒక్కటి కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో టిఆర్ఎస్ లక్షల కోట్లు దోచుకుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములు విక్రయించి డబ్బులు దోచుకుంటుంది’ అని కిషన్​ రెడ్డి అన్నారు. 12 సంవత్సరాలుగా దేశంలో బిజెపి అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని, బిజెపి ద్వారానే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. బిజెపి పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే, మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి (Kishan Reddy) హామీ ఇచ్చారు.

Read Also: తీర్ధాల జాతరకు భారీ ఏర్పాట్లు.. పనులను పరిశీలించిన అడిషనల్ డీసీపీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>