కలం, ఖమ్మం బ్యూరో: మహాశివరాత్రి సందర్భంగా తీర్ధాల జాతరకు (Theerthala Jatara) వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందని అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు గురువారం ఖమ్మం (Khammam) రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని రూరల్ ఏసీపీ, ఆర్టీసీ అధికారులు, ఆలయ కమిటీ, ఆలయ ఈవోతో కలిసి అడిషనల్ డీసీపీ సందర్శించారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆలయ స్వాగత ద్వారం మొదలుకొని గర్భాలయం వరకు క్యూలైన్లు, చలువ పందిళ్లు, పరిసరాలను పరిశీలించారు.
సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్, ఆర్టీసీ బస్టాప్ ప్రాంతాల దగ్గర బారికేడ్ల ఏర్పాటును పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్నానపు ఘాట్, ఇతర ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
Read Also: కాంగ్రెస్ – బీఆర్ఎస్ తోడు దొంగలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Follow Us On : WhatsApp


