గుజరాత్‌లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!

కలం, స్పోర్ట్స్ : గుజరాత్‌లో ఖేల్ మహాకుంభ్ (Khel Mahakumbh 2026)కు భారీ స్పందన వచ్చింది. ఈసారి ఏకంగా 76,02,178 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారు. 3,49,747 టీమ్‌లు పోటీలకు పేర్లు నమోదు చేసుకున్నాయి. రిజిస్ట్రేషన్లలో 45,43,945 మంది పురుషులు, 30,58,233 మంది మహిళలు ఉన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, వెయిట్‌లిఫ్టింగ్‌ సహా 35కి పైగా క్రీడల్లో పోటీలు జరగనున్నాయి.

ఖేల్ మహాకుంభ్‌ కోసం ఆగస్టు 29న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 22 సాయంత్రంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం క్రీడాకారులు కోచ్‌ల మార్గదర్శకత్వంలో పోటీలకు సిద్ధమవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఈ కార్యక్రమం మంచి వేదికగా మారుతోందని కోచ్‌లు తెలిపారు. ప్రతిభను ప్రదర్శించేందుకు, పోటీ అనుభవం పొందేందుకు ఇది ఉపయోగపడుతోందని చెప్పారు.

తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో విజేతలకు నగదు బహుమతులు అందించనున్నట్లు క్రీడాశాఖ అదనపు డైరెక్టర్ అమిత్ జీ. గమిత్ తెలిపారు. అండర్‌-11, అండర్‌-14 విభాగాల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించనున్నట్లు చెప్పారు. 2010లో ప్రారంభమైన ఖేల్ మహాకుంభ్‌(Khel Mahakumbh)ను ఈసారి ‘ఫ్రమ్ గ్రాస్‌రూట్స్ టు గ్రేట్‌నెస్’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువ క్రీడాకారులకు పోటీ వేదిక కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా ఉంది.

Also Read : బంగ్లాపై భారత్ జయకేతనం.. ఇక పాక్ తో సమరం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>