ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆకస్మిక తనిఖీ

కలం, ఉట్నూర్: ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel) శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన వైద్య సేవలు, మందుల లభ్యత, వైద్యులు, నర్సుల హాజరుపై వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, వైద్య సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఆరా తీశారు. రోగులకు అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత, శానిటైజేషన్‌ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వెడ్మ బొజ్జు పటేల్ (MLA Bojju Patel) సిబ్బందికి సూచించారు.

అత్యవసర సమయాల్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు, నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయవద్దని వైద్య సిబ్బందికి సూచించారు.

Also Read : 60 శాతం మంది ఓటర్లకు నోటీసులు: సుదర్శన్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>