‘ఫ్యూచర్ సిటీ’ పై బిగ్ అప్‌డేట్.. 71 గ్రామాల్లో అంతర్జాతీయ నగర నిర్మాణం!

కలం, వెబ్ డెస్క్ : రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (Future City) ప్రాజెక్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 2047 నాటి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 7 మండలాల్లోని 71 గ్రామాల పరిధిలో, సుమారు 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ స్థాయి నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సింగపూర్‌కు చెందిన ప్రముఖ ‘డీపీ ఆర్కిటెక్ట్స్’ సంస్థ ‘ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. దీంతో ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ (Telangana Global Summit) వేదికగా దీనిని ప్రభుత్వం అధికారికంగా ఆవిష్కరించనుంది.

రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ , రీజినల్ రింగ్ రోడ్ లతో ‘ఫ్యూచర్ సిటీ'(Future City)ని అనుసంధానించనున్నారు. ఫ్యూచర్ సిటీలో జోన్లవారీగా భూకేటాయింపులు జరిపారు. ఇందులో భాగంగా లైఫ్ సైన్సెస్ హబ్‌కు అత్యధికంగా 4,000 ఎకరాలు, నివాస ప్రాంతాలకు 2,477 ఎకరాలు, ఈవీ, ఎనర్జీ పార్కులకు 1,976 ఎకరాలు కేటాయించారు. అలాగే వైద్య సేవల కోసం హెల్త్ సిటీకి 594 ఎకరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీకి 403 ఎకరాలు, డేటా సెంటర్ హబ్‌కు 313 ఎకరాల భూమిని మాస్టర్ ప్లాన్‌లో వర్గీకరించారు.

అయితే భూముల జోనింగ్ వర్గీకరణ, భూసేకరణ విధానాలు, పరిహారం చెల్లింపులపై స్థానిక రైతుల్లో తీవ్ర ఉత్కంఠ, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ వ్యవసాయ భూములు ఏ జోన్‌లోకి వెళ్తాయోననే సందేహాలు రైతులలో ఉన్నాయి. అలాగే ఈ భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై పడే ప్రభావం, నీటి వనరుల సంరక్షణ, ముందస్తు పర్యావరణ అనుమతులకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో పిటిషన్ కూడా దాఖలైంది.

Also Read : ఎన్నికలే టార్గెట్.. మహిళా కాంగ్రెస్​ కు కొత్త సైన్యం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>