పుంగనూరు ఆవుకు భారీ డిమాండ్.. రికార్డు స్థాయిలో ధర

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో పుంగనూరు ఆవు (Punganur Cow) కు రికార్డు స్థాయిలో రూ.5.30 లక్షల ధర పలికింది. మాచవరానికి చెందిన ఆద్యశ్రీ డెయిరీ ఫాం యజమాని అడబాల ప్రేమకుమార్ వద్ద ఉన్న ఈ ఆవును తమిళనాడుకు చెందిన బీవీడీ లిమిటెడ్ సంస్థ అధినేత ప్రసాద్ కొనుగోలు చేశారు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చేయడంతో పాటు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఈ ఆవును కొనుగోలు చేసినట్లు తెలిపారు.

ఈ ఆవు రోజుకు మూడు లీటర్ల పాలు ఇస్తుందని, దాని ఎత్తు కేవలం 36 అంగుళాలు మాత్రమేనని ప్రేమకుమార్ వెల్లడించారు. గత ఆగస్టులో తన డెయిరీ ఫాం నుంచి పుంగనూరు గిత్త(Punganur Cow)ను జాతీయ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు రూ.3.75 లక్షలకు విక్రయించినట్లు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి అని ప్రేమకుమార్ తెలిపారు.

Also Read : నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>