60 శాతం మంది ఓటర్లకు నోటీసులు: సుదర్శన్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సర్ ప్రక్రియలో భాగంగా 60 శాతం మందికి నోటీసులు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) అన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు.. అందులో పేర్కొన్న విధంగా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో కూడా ఓటు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందని సీఈవో వివరించారు.

అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అనుమానం, సమస్య ఎదురైనా బీఎల్వోలను కలిసి పరిష్కరించుకోవచ్చని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ జరుగుతున్న తీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లోని బీఎల్‌వోల సహకారంతో కూడా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

తాండూరులో పర్యటన..

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. పలు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి బీఎల్వోలు చేపట్టిన ఓటరు నమోదు, నోటీసుల పంపిణీ, ధ్రువపత్రాల స్వీకరణ అంశాలను తనిఖీ చేశారు. వికారాబాద్ జిల్లాలో మాత్రం 72 శాతం నోటీసుల పంపిణీ పూర్తయినట్లు కలెక్టర్ సీఈవోకు వివరించారు. బీఎల్వోల విధులపై ఆరా తీసిన సుదర్శన్ రెడ్డి.. ఓటర్లకు క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, తాండూరు ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమై.. మండలాల వారీగా ఎంత మందికి నోటీసులు జారీ అయ్యాయి.. ఇంకా ఎన్ని పెండింగులో ఉన్నాయనేది ఆరా తీశారు.

Also Read: గోదావరిలో వరద ఉన్నా ఖాళీగా రిజర్వాయర్లు: హరీశ్ రావు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>