ఎన్నికల కోడ్​ ఉల్లంఘన కేసు.. హైకోర్టులో జగన్​ పిటీషన్​

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విజయం కూటమి పాలనకు నిదర్శనమని అధికార పార్టీ ప్రచారం చేసుకుంటోంది. మరోవైపు ప్రభుత్వ అధికారులను అడ్డుపెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో టీడీపీ అరాచకాలు సృష్టించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.

పులివెందులలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అలాగే, కేసులకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పులివెందుల ఆర్వో ఆఫీసు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారనే ఆరోపణలతో జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కేసును క్వాష్ చేయాలని జగన్​ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆయన (YS Jagan) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం నేడు (మంగళవారం) విచారణ చేపట్టనుంది.

కాగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో పులివెందుల పోలీస్​ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పులివెందుల మున్సిపల్​ ఎన్నికల పోలింగ్ రోజున పులివెందులలోని ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ ఆందోళన చేశారు. తమ ఏజెంట్లను బూత్​ ల్లోకి రానివ్వడం లేదని దాదాపు 70 మంది బూత్ ఏజెంట్లతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు చర్యలు తీసుకున్నారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై జగన్ వేసిన క్వాష్ పిటీషన్ విచారణకు రానుండడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>