మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి: వెడ్మ బొజ్జు

కలం, ఇంద్రవెల్లి: గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి, మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) అన్నారు. గురువారం ఇంద్రవెల్లి మండలంలోని ఇంకరిగూడ (ధనోరా (బి) గ్రామపంచాయతీ), దుబ్బగూడ (శంకర్‌గూడ గ్రామపంచాయతీ), ఈశ్వర్‌నగర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన విలేజ్ ఆర్గనైజేషన్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్కో వీవో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>