కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన.. బొజ్జు పటేల్‌ కీలక ప్రకటన

కలం, నిర్మల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్‌ (Vedma Bhojju Patel) తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ సూచనల మేరకు సెప్టెంబర్‌ 3న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బొజ్జు పటేల్‌ వెల్లడించారు.

ఇందులో భాగంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్‌ ప్రభుత్వ 1000 రోజుల పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 5న భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, బూత్‌ స్థాయి నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని బొజ్జు పటేల్‌ పేర్కొన్నారు. 1000 రోజుల పాలన సందర్భంగా నిర్వహించే విజయోత్సవాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్మల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>