కలం, నిర్మల్: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేలా.. తీసుకోవాల్సిన చర్యలపై నిర్మల్ (Nirmal) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. రవీందర్ బుధవారం కోర్టు పోలీసు కానిస్టేబుళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా పోలీసు సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, సంబంధిత ఇరుపక్షాలకు కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించాలని సూచించారు. రాజీ ద్వారా పరిష్కరించదగిన కేసులను గుర్తించి జాతీయ లోక్ అదాలత్‌కు తీసుకురావాలని తెలిపారు. లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా న్యాయ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో లైజనింగ్ అధికారి రమేష్, కోర్టు పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

