ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల్లో అక్రమాలు.. విచారణకు డిమాండ్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం వందనం గ్రామంలో నిర్వహించిన ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ ఉద్యోగాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆ గ్రామానికి చెందిన దగ్గుబాటి సామ్రాజ్యం ఆరోపించారు. గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉన్నత విద్యా అర్హతలు, అనుభవం ఉన్న తనలాంటి అభ్యర్థులను పక్కనపెట్టారన్నారు. తక్కువ అర్హతలు కలిగిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ​ఈ నియామకాల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై భారీగా డబ్బులు చేతులు మార్చినట్లు అనుమానం ఉందన్నారు.

ఇంటర్వ్యూ పేరిట రోజులు తరబడి కాలయాపన చేసి, చివరకు కేవలం ఒక్క నిమిషంలో మమ అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రతిభను కనీసం పరిశీలించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అభ్యర్థుల దరఖాస్తులు, ఎంపిక జాబితాపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని, అర్హులైనవారికి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>