కలం, కరీంనగర్ బ్యూరో: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టింది. చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిచారు. “హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్” నినాదంతో కలెక్టరేట్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.
రూ.11 వేల కోట్ల బకాయిలు..
ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. మద్యం శాఖకు మంత్రి ఉంటారు కానీ విద్యాశాఖకు మంత్రిని నియమించరా.. అని తీవ్రంగా మండిపడ్డారు.
పెండింగ్లో ఉన్న ర.11 వేల కోట్ల బకాయిలు ఒకేసారి విడుదల చేయాలని రమేష్ స్పష్టం చేశారు. బకాయిలు రాకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు పై చదువులకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, స్టేట్ కౌన్సిల్ నెంబర్ నునావత్ శ్రీనివాస్ నాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్, జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు, నగర ఉపాధ్యక్షుడు కసిరెడ్డి సందీప్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి బోయిన్ విష్ణువర్ధన్, రాజేష్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

