ఖమ్మంలో 70 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడిన 70 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఖమ్మం న్యాయమూర్తి బి.నాగలక్ష్మి రూ.7 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.

ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బెల్లం సత్యనారాయణ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించి, సురక్షితమైన రహదారి ప్రయాణానికి పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>