కాకరవాయిలో ఘనంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కలం, ​తిరుమలయపాలెం: ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం కాకరవాయి గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులకు శనివారం స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) అధికారులు ఘనంగా పంపిణీ చేశారు. రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.​ ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సుధీర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా చేరుతాయని పేర్కొన్నారు. అలాగే, రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ​గ్రామంలోని ప్రతీ అర్హునికి సంక్షేమ పథకాలు దక్కేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్, మండల కాంగ్రెస్ నాయకులు కట్కూరి శ్రీనివాసరెడ్డి, రేషన్ షాప్-1 డీలర్ దంతాల బాలరాజు, రేషన్ షాప్-2 మహిళా సంఘాల డీలర్లు, వార్డు సభ్యుడు నల్లగట్టు శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>