కలం/ఖమ్మం బ్యూరో : ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డు (Mirchi Market Yard) దశ తిరగబోతోంది. మిర్చి మార్కెట్ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం రూ.155 కోట్ల 30 లక్షలు కేటాయించింది. డెవలప్ మెంట్ పనులను రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయించారు. మొదటి దశలో రూ.114 కోట్ల 96 లక్షల పనులు చేపట్టనున్నట్లు సమాచారం. మార్కెట్ యార్డ్ లో 7 షెడ్ల నిర్మాణ పనులు ఫైనల్ చేసి ఇప్పటికే 5 షెడ్లను పూర్తి చేశారు. మార్కెట్ యార్డు వద్ద అవసరమైన టాయిలెట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఆర్ఓ ప్లాంట్, సంపు, పంప్ రూమ్, ప్రహరీ గోడ, హై మాస్ లైటింగ్, అగ్ని ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫైటింగ్ పైప్స్ వేసే పనులు జరుగుతున్నాయి.ప్రభుత్వం ఇప్పటి వరకు 39 కోట్ల 41 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
ప్రస్తుతం సాగవుతున్న మిర్చి పంట మార్కెట్ కు వచ్చే సమయానికి వినియోగించుకునే విధంగా మార్కెట్ షెడ్లు, ఇతర స్ట్రక్చర్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. మొదటి దశ పనులు ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయనున్నారు. రాబోయే మార్కెటింగ్ సీజన్ లో మిర్చి తరలింపునకు అనుకూలంగా ఉండేందుకు అవసరమైన అదనపు మార్కెట్ షెడ్స్, ఇతర స్ట్రక్చర్ల నిర్మాణ పనులను ఫిబ్రవరి 15 వరకు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
రైతులు మార్కెట్ యార్డ్ (Mirchi Market Yard) లోకి రాగానే మంచి అనుభూతి పొందేలా అంతర్జాతీయ స్థాయిలో అన్ని వసతుల కల్పన ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లలో ఆరోజు ధర ఎల్ఇడి స్క్రీన్లలో కనిపించేలా, అలాగే ఏజెంట్, ట్రేడర్, రైతులకు లాభసాటి గా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎవ్‌ఱఅ దగ్గరే ఏ లాట్ కి వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, స్లాట్ బుకింగ్, రష్ గురించి రైతు పూర్తి సమాచారం తెలుసుకుని, రైతు దర్జాగా వచ్చి, స్లాట్ బుకింగ్ చేసుకొని, ధర కూడా పారదర్శకంగా పొందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. సిసి కెమెరాల ఏర్పాట్లు. రైతులు రాత్రి బస చేస్తే, అందుకు తగ్గట్టు అన్ని వసతుల కల్పన చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, క్యాంటీన్, సోలార్ పవర్, వేయింగ్ బ్రిడ్జ్ ల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రభుత్వం నిధులు కేటాయించి, ఆధునీకరణ పనులు చేపడుతుండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.


