ఖమ్మం మార్కెట్‌లో పత్తికి పెరిగిన ధర.. మిర్చికి తగ్గిన రేటు!

​కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో (Khammam Market) సోమవారం పంట ఉత్పత్తుల ధరల్లో మిశ్రమ స్పందన కనిపించింది. గత వారాంతంతో పోల్చితే పత్తి ధర (Cotton Price) స్వల్పంగా పెరగగా, మిర్చి ధరలు (Chilli Prices) కొంతమేర తగ్గుముఖం పట్టాయి. మార్కెట్ కమిటీ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం జరిగిన జెండాపాటలో క్వింటా పత్తి ధర రూ.8,900 పలికింది. ఇక మిర్చి విషయానికొస్తే, క్వింటా ఏసీ (AC) మిర్చి రూ.22,925, నాన్-ఏసీ మిర్చి రూ.16,000 చొప్పున ధరలు నమోదయ్యాయి.

​ఈ నెల 13వ తేదీ (శుక్రవారం) నాటి మార్కెట్ ధరలతో పోల్చితే సోమవారం ధరల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. శుక్రవారం ధర కంటే పత్తి క్వింటాకు రూ.100 పెరగగా, ఏసీ మిర్చి క్వింటాకు రూ.225, నాన్-ఏసీ మిర్చి క్వింటాకు రూ.100 చొప్పున తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. పత్తి ధర పెరగడం పట్ల పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా, మిర్చి ధరలు తగ్గడంతో మిర్చి రైతులు కొంత నిరాశకు గురయ్యారు.

Also Read : సైనికులపై హనీ ట్రాప్.. ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>