కాంగ్రెస్ కీలక సమావేశం.. ఎన్నికలకు సిద్ధం!

కలం, వెబ్ డెస్క్: యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధమవుతోంది. ఆ పార్టీ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో కీలక సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా యూపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ‘అక్కడ తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించాం. యూపీ ఎన్నికలు దేశ రాజకీయాలకు కచ్చితంగా ఒక కొత్త దిశను అందిస్తాయని మాకు నమ్మకం ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. సామాజిక న్యాయం, అందరికీ సమాన అవకాశాలు, అణగారిన వర్గాలకు న్యాయం దక్కాలనేది వారి ఆకాంక్ష. కాంగ్రెస్, ఇండియా కూటమి యూపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవించబోతున్నాయి’ అని ఖర్గే పేర్కొన్నారు.

సీట్లపైనే ఇరు పార్టీల పట్టు..

యూపీ అసెంబ్లీలో 403 స్థానాలుండగా.. కాంగ్రెస్ పార్టీ 181 స్థానాలను కోరుతోంది. మరోవైపు అక్కడ బలమైన సమాజ్ వాదీ పార్టీ కూడా 181 స్థానాలో పోటీ చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై రేపు లక్నోలో ఇరు పార్టీల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. అందుకు ఒక రోజు ముందుగానే ఖర్గే ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు సమావేశమై.. సీట్ల కేటాయింపుపై సమాలోచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి (INDIA Bloc) నుంచి విడిపోమని.. కాంగ్రెస్ పార్టీ(Congress Party)తో కలిసి బీజేపీని ఓడించి తీరుతామని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఎవరెన్ని సీట్లలో పోటీ చేయబోతుందనేది మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.

Also Read : తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం.. 92వేల మందిపై కేసుల ఎత్తివేత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>