కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) జిల్లా ప్రజల మెదళ్ళకు అధికారులు పని కల్పించారు. వెలుగుమట్ల (velugumatla) అర్బన్ పార్క్ కు కొత్త పేరు, ట్యాగ్ లైన్ సూచించి, నాలుగు వేల రూపాయల బహుమతి గెలుచుకోనే అవకాశం కల్పించారు. వెలుగుమట్ల అర్బన్ పార్కుకు కొత్త పేరు, ట్యాగ్ లైన్, అధికారిక లోగో తయారు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది, ఇందులో భాగంగా పబ్లిక్ కాంపిటీషన్ చేపట్టారు.
జనవరి 10 నుంచి జనవరి 20 వరకు పబ్లిక్ కాంపిటీషన్ ఉంటుంది. ఆసక్తి గలవారు వెలుగుమట్ల (velugumatla) అర్బన్ పార్కుకు కొత్త పేరు ట్యాగ్ లైన్ సూచించి, 4 వేల రూపాయల బహుమతి గెలుచుకోనే అవకాశం కల్పించింది. అలాగే వెలుగుమట్ల అర్బన్ పార్కు కొత్త అధికారిక లోగో డిజైన్ చేసిన వారికి కూడా 4 వేల రూపాయలు బహుమతి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు పామ్ప్లేట్ లో ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి పాల్గొనవచ్చు.
Read Also: ముత్యాలవాగు చెక్‌డ్యామ్‌కు నిధులు
Follow Us On : WhatsApp


