Mobile Popup Ad
Mobile Popup Ad

ఖమ్మం వెలుగుమెట్ల బాధితులకు గుడ్‌న్యూస్.. కలెక్టర్ కీలక ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం వెలుగుమెట్ల (Velugumatla) ఇండ్ల కూల్చివేత వ్యవహరం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం (Khammam) నగర పరిధిలోని వెలుగుమెట్ల బాధితులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి (Collector Anudeep Durishetty) శుభవార్త తెలిపారు. ఈ నెల 24న భూదాన్ భూముల (Bhoodan Lands) ఆక్రమణలో తొలగించిన ఇండ్లకు సంబంధించి వ్యక్తుల సామాజిక, ఆర్థిక సర్వేను వెంటనే చేపట్టనున్నట్లు కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తొలగించబడిన ఇండ్లకు సంబంధించిన వ్యక్తుల వివరాలను సేకరించాలని 14 మంది తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సామాజిక, ఆర్థిక సర్వే పూర్తయిన వెంటనే, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వాదేశానుసారం నివాస స్థల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుకు చర్యలు చేపడతామన్నారు. వెలుగుమట్ల (Velugumatla) బాధితులు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండి సర్వేకు సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Read Also :  భద్రాద్రి కొత్త కలెక్టర్ అంకిత్ తన మార్క్ చూపిస్తారా?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>