కలం, వెబ్ డెస్క్: గ్యాస్ కొరత తిరుమల (Tirumala) వేంకటేశ్వరుడి కొండను తాకింది. కొండపై ఉన్న హోటళ్లు మూసివేత దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరత (Gas Shortage)తో తిరుమల కొండపై 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో టీటీడీ ఉచిత అన్నదానానికి భక్తులు క్యూ కడుతున్నారు. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం అదనంగా లక్ష మంది భక్తులు అన్నదాన సత్రాలకు వస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు నిత్యాన్నదాన సత్రాల్లో వంట చేసేందుకు టీటీడీ 6 టన్నుల గ్యాస్ వినియోగిస్తోంది. ప్రస్తుతం ఐవోసీఎల్ నుంచి గ్యాస్ అందుతున్నా హోటళ్ల మూసివేతతో అన్నదాన సత్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే ఉంటే ఉచిత అన్నదానం కష్టమేనని భక్తులు భావిస్తున్నారు.

